2 May, 2026 | 1:52 AM

కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

02-05-2026 12:00 AM

కలెక్టర్ ప్రతిమా సింగ్ 

మెదక్, మే 1 (విజయక్రాంతి): శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు - 2026 ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ సాహితి, జడ్పి సీఈఓ ఎల్లయ్య తో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి ఆరంభించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.  అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పోస్టర్స్ ను ఆవిష్కరించారు. కార్మిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పరిశ్రమల శాఖ యాజమాన్యం ఐ.టీ.సీ ఫ్యాక్టరీస్ సిబ్బంది  కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.