2 May, 2026 | 1:52 AM

తూప్రాన్‌లో ఘనంగా మే డే

02-05-2026 12:00 AM

తూప్రాన్, మే 1: తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని కార్మికుల సంఘాలతో కలిసి జండా ఆవిష్కరణలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్  ప్రతాపరెడ్డి  కార్మికులను శాలువాతో సన్మానించారు. మాట్లాడుతూ కార్మిక సంఘ నాయకులు దేశానికి వెన్నెముక లాంటిదని దేశ రక్షణ ఎంత ముఖ్యమో దేశ శుభ్రత అంతే ముఖ్యమని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్, చెలిమెల రాములు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రఘుపతి, ప్రభాకర్ రెడ్డి, కొక్కొండ కాశిరెడ్డి, పోతురాజు ధనరాజ్, బుక్క విజయకుమార్, సతీష్ చారి, బజారు చక్రవర్తి, నాగేంద్ర, కార్మిక సంఘ నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

రేగోడు..                      

రేగోడు, మే1; మండల కేంద్రమైన రేగోడులో సిఐటియు ఆధ్వర్యంలో మే డే సందర్భంగా సిఐటియు నాయకులు అంగన్వాడి కార్మికులు ఆశావర్కర్లు పిఎసిఎస్ ఉద్యోగులు సిఐటియు జెండాను ఆవిష్కరించి ఘనంగా మే డే వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఎండి సర్దార్, మాజీ ఎంపిటిసి గొల్ల నరసింహులు, పిఎసిఎస్ సీఈవో ఆఫీసుద్దీన్, హనుమంతు, నాయకులు అమృత్, ఆశా వర్కర్లు ప్రభావతి, అంగన్వాడీ కార్మికులు పాల్గొన్నారు.

కొల్చారం..

కొల్చారం, మే 1 : శుక్రవారం మే డే సందర్భంగా కొల్చారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేశారు. తుక్క పుర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఉపసర్పంచ్ ఆరే రవీందర్ తో కలిసి గ్రామపంచాయతీ కార్మికులకు బట్టలు పంపిణీ చేస్తూ శాలువాలతో సన్మానించారు. కొల్చారం మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద,నాయిని జలాల్ పూర్ గ్రామంలో, వరిగుంతం వెంకటాపూర్ కొంగోడు గ్రామాలలో కార్మికులు జెండా ఆవిష్కరణ చేశారు. గ్రామాలలో అన్ని వర్గాల వారు జెండా ఆవిష్కరణకు మద్దతు తెలియజేశారు.