calender_icon.png 4 February, 2026 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిమ్స్ నుంచి పరారైన మహిళ రిమాండ్ ఖైదీ

04-02-2026 01:09:33 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ పరారైన ఘటన జిల్లాలో కలకలం రేపింది. గత నెల 30వ తేదీన బాసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనం కేసులో షభానా అనే నిదితురాలిని జిల్లా జైలుకు రిమాండ్ కు తరలించారు.

ఐతే వైద్య చికిత్స నిమిత్తం రిమ్స్ లో ఉండగా మంగళవారం పోలీసుల కళ్ళుకప్పి ఆసుపత్రి నుండి ఆమె పరారైయ్యారు. ఐతే రెండు గంటల నుండి పోలీసు లు ఆమె కోసం వెతుకులాడారు. చివరకు నిర్మల్ లో రిమాండ్ ఖైదీ షభానా ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడి నుండి తిరిగి ఆదిలాబాద్ జిల్లా జైల్‌కు తరలించారు.