21 March, 2026 | 1:55 PM

Breaking News

నిరుపేద ముస్లింలకు రంజాన్ మోదీ కిట్‌ల పంపిణీ   •   రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోటలక్ష్మికాంతారావు   •   బీసీలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం   •   ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం   •   జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •  

దసరా నాటికి పనులు పూర్తి కావాలి

09-10-2024 12:11 AM

కలెక్టర్ బదావత్ సంతోష్

సీఎం స్వగ్రామంలో పర్యటన

కల్వకుర్తి, అక్టోబర్ 8: సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను దసరా నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొండారెడ్డి గ్రామంలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.

దసరా రోజున ముఖ్యమంత్రి స్వగ్రామానికి రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, తాగునీరు, రోడ్లు, పార్కిగ్ అంశాలపై చర్చించారు. ఆయనవెంట ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఏవీఎన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.