16 June, 2026 | 1:45 AM

వీడిన చోరీ కేసు మిస్టరీ బంగారం, వెండి రికవరీ

16-06-2026 12:40 AM

గద్వాల జూన్ 15: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ కాలనీలో ఇటీవల జరిగిన చోరీ కేసును పట్టణ పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా వారిలో ఒకరు బాలనేరస్థుడిగా గుర్తించారు. ఈ నెల 10వ తేదీన రహ్మత్ పాషా ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి సుమారు 9 తులాల బంగారం,60 తులాల వెండి ఆభరణాలు, రూ.7 వేల నగదును అపహరించారు.

బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పర్చగా రిమాండ్కు తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్‌ఐ కళ్యాణ్ కుమా ర్తో పాటు క్రైమ్ టీమ్ సిబ్బంది చందు, కిరణ్, రామకృష్ణ ను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.