8 వంగడాలతోనే రైతులకు లాభాలు
- విదేశాల్లో తెలంగాణ బియ్యానికి ఫుల్ డిమాండ్
- డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
- హాజరైన మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ అద్భుతమైన డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి సాగుపై రైతులకు పెద్ద ఎత్తున విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవే త్తలు ప్రభుత్వానికి సూచించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సోమవారం ప్రజాభవన్‌లో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలా పాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగుపై క్యాబినెట్ సబ్ కమిటీ చాలా లోతుగా సమీక్ష చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, శాస్త్రవేత్తలు పలు కీలక ప్రతిపాదనలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు లాభాదాయకం, ఎగుమ తులకు అనుకూలమైన బీపీటీ 5204, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048), కేఎన్‌ఎం 1638, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ, వీజీఎల్ 962, వీజీఎల్ 44, జేజీఎల్ 1798 ఈ 8 రకాల వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మార్కెట్లో ఈ 8 రకాల బియ్యానికి ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, ప్రభుత్వ మద్దతు ధర కంటే చాలా ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది.
అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో ఈ బియ్యానికి విపరీతమైన ఆదరణ ఉంది. దీనివల్ల ఇది రైతులకు అత్యంత లాభదాయకమైన పంటగా మారనుందపి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ మేర కు అడుగులు వేస్తుందని వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు సైతం క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదించారు. రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేందర్ మోహన్, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపీ, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ రాజ్, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.






