9 April, 2026 | 10:43 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

అప్పుడు తయారైతడు దివానా!

13-02-2026 12:00 AM

‘శుభం’ ఫేమ్ హర్షిత్‌రెడ్డి హీరో గా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవానా’. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమకథతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్న ఈ సినిమా ఈ వేవివిలో వినోదం పంచేందుకు సిద్ధమవుతోంది. వాలెంటైన్స్ డేను పురస్కరించుకొని తాజాగా ఈ సినిమా స్టోరీ పోస్టర్‌ను మేకర్స్ గురువారం రిలీజ్ చేశారు.

గాఢమైన ప్రేమలో ఉన్న హీరో తన ప్రేమ గురించి, ప్రేయసి గురించి చెప్తున్న ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. “లవ్ అనేది కావాలని ఎవడు చేయడు.. అది ఐపోతది అంతే.. ఒక పిచ్చి పిల్ల కోసం దిల్‌లో విల్లా కట్టేస్తాం. ఆ ఒక్క పిల్ల వల్ల జీవితం ఉల్టా పల్టా ఐపోతున్నా గాల్లో తేలుతుంటం, ప్రాణం పెట్టేస్తం, జాన్ ఇచ్చేస్తం.. ఆ వైబే వేరుంటది లే.

లవ్ లైట్‌గా ఉన్నంతవరకే బ్రో ఎవడైనా లవర్ బాయ్.. అదే లవ్ దిల్ మొత్తం నిండిపోతే అప్పుడు తయారైతడు ఒక దివానా, ప్యార్ ఒక కిర్రాక్ నషారా బై, సస్తున్నా మస్తు ఉంటది”.. అంటూ సాగుతోందీ గ్లింప్స్. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ చంద్; డీవోపీ: వంశీ పచ్చిపులుసు; ఎడిటర్; హృషికేశ్ పాస్పల్; ప్రొడక్షన్ డిజైన్: ఝాన్సీ గోజల.