కులవృత్తులకు కాంగ్రెస్‌లో ప్రోత్సాహం లేదు
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌గర్, మార్చి 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో కులవృత్తులకు ప్రో త్సాహం లభించడం లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారే డ్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఇటీవల నూతనంగా ఎన్నికైన బన్సీలాల్ పేట నాయీబ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మీకు ఏ అవసరమొచ్చిన నేను అండగా ఉంటానని, కలసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో నూతన కమిటీ అధ్యక్షుడు రామచందర్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సాయికిరణ్, కోశాధి కారి జయకృష్ణ, ఇతర సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, ప్రేమ్ తదితరులు ఉన్నారు.




