31 August, 2026 | 9:30 AM

Breaking News

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి   •   క్రీడా స్ఫూర్తితో గెలపోటములను స్వీకరించాలి: ప్రాజెక్టు అధికారి రాహుల్   •   చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి   •   ఆదివాసి యువతి శిరీష కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి   •   యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం   •   యావాపూర్ లో ఘనంగా బోనాలు   •   అత్యంత వైభవంగా బోనాల పండుగ   •   సాంబ శర్వాణి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి   •   ఉమ్మడి మానాలలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   •   కౌకూర్ మోడల్ మార్కెట్ భవనం కోసం నాలుగో రోజు ధర్నా   •  

గ్లామర్ రోల్స్ చేయొద్దనే నిబంధనేమీ పెట్టుకోలేదు

08-07-2025 12:00 AM

కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకత్వంలో వీ ఆర్ట్స్ పతాకంపై హరీశ్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకి మాళవిక మనోజ్ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించింది. “ఈ సినిమా కథ వినగానే ఎంతో నచ్చింది. అందులో నచ్చిన అంశాల గురించి ఒక్క వాక్యంలో చెప్పలేను. చాలా విభిన్నంగా అనిపించింది. గతంలో సాధారణ గ్రామీణ అమ్మాయిగా చేశా. ఇందులో నా క్యారెక్టర్ ఎంతో మోడ్రన్‌గా, హైపర్‌గా, ఆటిట్యూడ్‌తో ఉంటుంది.

నా పాత్ర పేరు సత్యభామ. నా వ్యక్తిగత జీవితానికి ఎలాంటి పోలిక లేనిదీ పాత్ర. తెలుగులో నటించడం చాలా ఆనందం అనిపించింది. ఇక్కడి టెక్నిషియన్స్, ఆర్టిస్టుల్లో ఎంతో ప్రొఫెజనలిజం ఉందని గమనించా. తెలుగు రాకపోయినా, భావం అర్థం చేసుకుని నటించా.  నాకు ఈత కొట్టడం రాకపోయినా, షూటింగ్ వాయిదా పడటం ఇష్టంలేక ఓ సన్నివేశంలో స్విమింగ్ చేశాను.

ఎంతో భయమేసింది. ఎప్పుడూ, విభిన్నంగా, సవాల్ విసిరే పాత్రలే చేయాలని ఉంటుంది. ఎందుకంటే, రొటీన్ పాత్రలే చేస్తుంటే.. నాకే కాదు ప్రేక్షకులకూ బోర్ కొడుతుంది. సుహాస్ వెరీ నైస్ పర్సన్. ఎంతో హార్డ్‌వర్క్ చేస్తాడు. సెట్‌లో సినిమా కోసమే మాట్లాడతాడు. పెద్ద టాకింగ్ పర్సన్ కాదు. సినిమా నేపథ్యంతో సంబంధం లేని కుటుంబం నాది. ఫ్యామిలీ సపోర్ట్‌తోనే  నటిస్తున్నా. గర్వంగా ఉంది. నాకు చాలా ఆఫర్లు వచ్చాయి.. నచ్చిన కథలకే ఓకే చెప్తున్నా” అని తెలిపింది.