calender_icon.png 8 July, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి చిత్రం పేరు.. మారెమ్మ-

08-07-2025 12:00:00 AM

టాలీవుడ్ స్టార్ రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘మారెమ్మ’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. దీపా బాలు కథానాయికగా నటిస్తోంది.

వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వీఎస్ రూపలక్ష్మి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో యువ కథానాయకుడు మాధవ్.. గళ్ల అంగి, లుంగీ ధరించి, మెడలో టవల్‌తో రగ్గ్‌డ్ రూరల్ లుక్‌లో కనిపించాడు.

పొడవాటి కర్రను పట్టుకుని ఏ సవాలైనా ఎదుర్కోవడానికి సిద్ధం అన్నట్టుగా చూస్తున్న మాధవ్ తన తొలి పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి; సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, కమల్ ఎస్లావత్; డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి; యాక్షన్: మాడిగొండ నటరాజ్; ఎడిటర్: దేవ్ రాథోడ్; ఆర్ట్: రాజ్‌కుమార్ మురుగేషన్.