10 April, 2026 | 1:40 AM

వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదు

10-04-2026 12:22 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 9 విజయక్రాంతి నాగర్ కర్నూల్ జిల్లాలో వినియోగదారులకు అందించే వంటగ్యాస్ కొరత ఏమీ లేదని జిల్లా కలెక్టర్ బావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారులతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.

జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై శాఖలతో కలిసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అక్రమ సిలిండర్ వినియోగంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.