10 April, 2026 | 1:45 AM

ముద్దసాని ఆశయాలను కొనసాగిస్తాం..

10-04-2026 12:23 AM

రైతులు, పేద ప్రజల కోసం నిరంతరం పరితపించిన నాయకుడు

వచ్చే 15వ వర్ధంతి నాటికి జమ్మికుంటలో ముద్దసాని విగ్రహం ఏర్పాటు

దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు

మానకొండూరు, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రైతుల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయాలను సదా కొనసాగిస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న 15వ వర్ధంతి కార్యక్రమం రోజున జమ్మికుంటలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదివేల మందితో సభ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మాజీ మంత్రి, దివంగత ముద్దసాని దామోదర్ రెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకొని, మానకొండూరు మండలం సదాశివపల్లి జంక్షన్ లో గురువారం నెలకొల్పిన ఆయన  కాంస్య విగ్రహా న్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి ఆవిష్కరించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పిం చారు. టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనా రాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభకలో  దామోదర్ రెడ్డి వల్లనే తాను  ఈ స్థాయికి వచ్చానని  విజయ రమణారావు సగర్వంగా చెప్పారు. 

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం , పెద్దపల్లి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పాతుపల్లి ఎల్లయ్య, హుజురాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి వోడితెల ప్రణవ్ బాబు, దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు కొత్తూరి జగన్ గౌడ్, వాసాల రమేష్, డాక్టర్ పి. రవీందర్ రావు, కర్రు నాగయ్య, మాదాడి శ్రీనివాస్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఒగ్గు దామోదర్,ఆకుల నరసయ్య, మినుపాల ప్రకాష్ రావు, అక్కపాక తిరుపతి, కొత్త తిరుపతిరెడ్డి, కందుల ఆది రెడ్డి, చందా గాంధీ,బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఊకంటి  మధుకర్, పడాల అజయ్, పొనగంటి మల్లయ్య తదితరులు ఈ కార్యక్ర మానికి హాజరయ్యారు.