22, 24వ వార్డుల్లో పోషక పక్వాడ
10-04-2026 12:19 AM
ఇల్లందు టౌన్ ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 22, 24వ వార్డుల్లో నిర్వహించిన పోషక పక్వాడ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు కొర్లపాటి శివ కిరణ్, శనిగారపు శృతి పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు.
రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, పిల్లల ఎదుగుదలలో సమతుల్య ఆహారం, శుభ్రత ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ధనలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సక్కుబాయి, సరస్వతి, అరుణకుమారి, ఆశా వర్కర్ కరుణ తదితరులు పాల్గొన్నారు.




