రాజకీయాల్లో మార్పు రావాలి
ప్రజల ఆకాంక్షలతో పనిచేసే ప్రభుత్వం ఏర్పడాలి
కేయూలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
టీఆర్పీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలి
టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
వరంగల్/ మహబూబాబాద్/హనుమకొండ, మార్చి 13 (విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభు త్వం ఏర్పడేలా రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగు తున్నట్లు టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, చదువుకో వాలనే ఆశతో యూనివర్సిటీలో చేరినా ఇప్పుడు ఆకలి, వసతి, పరిశుభ్రత కోసం పో రాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్సిటీలో చదు వుతున్న విద్యార్థులలో అధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారేనని, వారి కి సరైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మల్లన్న పేర్కొన్నారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ శ్రద్ధగా విన్న ఎమ్మెల్సీ మల్లన్న, కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, ప్రొఫెసర్లతో ముఖాము ఖి సమావేశం నిర్వహించారు.
యూనివర్సిటీకి చేరుకున్న మల్లన్నకు యూనివర్సిటీ అధికారులు అధికారిక స్వాగతం పలికారు. ముందుగా మహాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయం, విద్యా హక్కులు, సమానత్వం కో సం జీవితాంతం పోరాడిన ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఆశయాలను స్మరించుకు న్నారు. అనంతరం సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. ముఖ్యంగా హాస్టల్ సౌకర్యాలు, గ్రంథాలయ విస్తరణ, మెస్ నిర్వహణలో పారదర్శకత, రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ, స్కాలర్షిప్ల విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మండలిలో గొంతు ఎత్తుతానని స్పష్టం చేశారు.
కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించవచ్చని పేర్కొంటూ రిజిస్ట్రార్‌ను ఉద్దేశించి హాస్టల్ నీటి సమస్య, గ్రంథాలయ విస్తరణ, మహిళా విద్యార్థుల బస్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడేలా రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని కృషి చేస్తానని అన్నారు. ఈ సమ స్యల విషయంలో తాను కూడా బాధ్యత తీసుకుంటానని, మండలిలో ప్రత్యేకంగా మాట్లాడతానని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు.
తమ సమస్యలను వినిపించుకునే నాయకుడు ఉన్నాడనే నమ్మ కం కలిగిందని విద్యార్థులు పేర్కొన్నారు. అదేవిధంగా యూనివర్సిటీ మెస్ కమిటీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న సుమారు రూ.8 కోట్ల అవినీతి అంశంపై కమిటీ వేసి నా, ఇప్పటి వరకు వాస్తవాలు వెల్లడించలేదని విద్యార్థులు ప్రశ్నించారు. అనేక సమ స్యలకు సంబంధించిన వినతి పత్రాలను విద్యార్థుల నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వీకరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న పలువురు పార్ట్‌టైం ఉద్యోగులు కూడా తమ సమస్యలను మల్లన్నకు వివరించారు. యూనివర్సిటీకి చెందిన అధికారులు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, టీఆర్పీ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలి : తీన్మార్ మల్లన్న
రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలని, ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. హనుమకొండలోని రెడ్డికాలనీ, శారద గార్డెన్స్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ముఖ్య నాయకులతో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖాముఖి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ కార్యకలాపాలు, స్థానిక ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ విస్తరణ, గ్రామస్థాయిలో కార్యకర్తల బలోపేతం, ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంపొందించడం, రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. నాయకులు తమ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మల్లన్న దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన తీన్మార్ మల్లన్న పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బలమైన టీమ్‌గా పనిచేస్తేనే పార్టీ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మరింత బలపేతం అవుతుందన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడే రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలన్నారు.




