9 June, 2026 | 1:13 AM

కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో జెండా మోసిన ఏకైక నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి

09-06-2026 12:04 AM

ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీపీసీసీ ప్రతినిధి

జక్కిడి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు 

ఎల్బీనగర్, జూన్ 8: టీపీసీసీ ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మన్సూరాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ నాయకులు జక్కడి సత్య తేజ్ రెడ్డి విచ్చేసి కేకే కట్ చేసి  వనస్థలిపురం హాస్పిటల్ లో పండ్లు పంచిపెట్టి పుట్టినరోజు వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో కూడా పార్టీ జెండా మోసిన ధీరుడు అన్నారు.

రెడ్డిమల్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో చంపాపేట వికలాంగుల హాస్టల్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీనగర్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంజు గౌడ్ ఆధ్వర్యంలో చేయూత ఫౌండేషన్ లో అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మున్నా జానీ, రఘుపతి, గిరి, విఠల్ రెడ్డి, వెంకట్, సాయి, సతీష్ రెడ్డి, స్వామి గౌడ్, ఇరిగి రమేష్, గంటా శ్రవణ్, జిలాని, రాజశేఖర్, జకీర్, జగదీష్ గౌడ్, పృధ్విరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.