07-02-2026 12:00:00 AM
సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి6 (విజయ క్రాంతి): నియోజకవర్గ పరిధిలో సీవరేజ్ సమస్యలను చాలా వరకు పరిష్కరించినట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మోండా మార్కెట్ మెయిన్ రోడ్ పై 3.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పనులను ఆయన కార్పొరేటర్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 2014 కు ముం దు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొంతం దీపికా, బోయిన్‌పల్లి సర్కిల్ డిసి డాకు నాయక్,వాటర్ వరక్స్ డిజిఎం ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.