16 July, 2026 | 2:00 PM

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండరాదు

11-12-2024 02:09 AM
  • బెంగాల్ ఓబీసీ జాబితా కేసులో సుప్రీం కోర్టు
  • తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దేశంలో మతం ఆధారంగా రిజర్వేషన్ కల్పించలేమని సు ప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ము స్లిం వర్గాలను ఇతర వెనకబడిన తరగతుల జాబితా(ఓబీసీ)లో  చేర్చడాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. 2010 నుంచి ముస్లిం వర్గాలతో పాటు 77  సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో బెంగాల్ ప్రభుత్వం చేర్చిం ది.

అయితే ఈ నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. కొన్ని సామాజిక వర్గాలను ఓ బీసీలుగా ప్రకటించడానికి మతం ఒక్కటే ఏకై క ఆధారంగా కనిపిస్తున్నదని హైకోర్టు పేర్కొన్నది. హైకోర్టు తీర్పుతో సుమారు 12 లక్షల మంది ఓబీసీ సర్టిఫికెట్లు రద్దయ్యాయి. దీంతో  విద్యార్థుల, ఉద్యోగార్థుల హక్కులను హైకోర్టు తీర్పు  ప్రభావితం చేస్తున్నదని పే ర్కొంటూ ఆ తీర్పుపై స్టే విధించాలని, మ ధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టును బెంగాల్ ప్రభుత్వంతో పాటు పలువురు ఆశ్రయించారు.

ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఓబీసీ రిజర్వేషన్ మతం ఆధారంగా ఇచ్చింది కాదని, వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిందని బెంగాల్ ప్రభుత్వం తరఫున కపిల్ సిబల్ వాదించారు. హిందువులకు సైతం వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్ ఉందని, రంగనాథన్ కమిషన్ కూడా వీరికి రిజర్వేషన్లు కల్పించాలని సూచించిందని, వీటిలో చాలా వర్గాలు కేంద్ర ఓబీసీ జాబితాలో ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

ముస్లింలు ఓబీసీ రిజర్వేషన్లకు అర్హులు కాదా అని సిబల్ ప్రశ్నించారు. చట్టంలోని నిబంధనలు కొట్టివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. అయితే మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. దీనిపై కపిల్ స్పందిస్తూ రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన కాదని, వెనుకబాటుతనంపై ఆధార పడి ఉన్నాయని, హిందువులతో పాటు అన్ని మతాలకు వర్తిస్తుందని, ఇది ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదన్నారు.

రాష్ట్రంలో 28 శాతం ఉన్న మైనారిటీ జనాభాలో ముస్లింలు 27 శాతం ఉన్నారని ఆయన తెలిపారు. ముస్లింలకు 10% రిజర్వేషన్ కల్పిం చాలన్న రంగనాథన్ కమిషన్ సిఫారసులను ఆయన ప్రస్తావించారు. అయితే సర్వేకు సంబంధించిన సరైన ఆధారాలను చూపడంలో రాష్ట్రం విఫలమైందని, హైకోర్టు ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించిందని ప్రతివాదుల తరపు న్యాయవాది వాదించారు. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని పిటిషనర్ల తరపు న్యా యవాదిని సుప్రీం కోరింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే జనవరి 7కు వాయిదా వేసింది.