16 July, 2026 | 2:15 PM

ఇండియా అధిపతి మారేనా?

11-12-2024 02:15 AM
  • ముదురుతున్న కూటమి వివాదం!
  • మమతకు పెరుగుతున్న మద్దతు
  • తాజాగా మమతకు జైకొట్టిన లాలూ, వైసీపీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రతిపక్ష ఇండి యా కూటమి కన్వీనర్ విషయంలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం కన్వీనర్‌గా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని నియమించాలనే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే సమయంలో బెంగాల్ బయట జరిగిన ఎన్నికల్లో తృణమూల్ పరిస్థితిని గురించి కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అయినా కానీ కాంగ్రెస్ అభ్యంతరం చెప్పినా అది పెద్ద సమస్యే కాదని కూటమి నేతలు కొందరు కామెంట్ చేస్తున్నారు. 

వైసీపీ కూడా మమత వైపే.. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీతో ఉన్న వైసీపీ పార్టీ కూడా ప్రస్తుతం ఇండియా కూటమికి దగ్గరగా ఉంటోంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీ కూటమిని ముం దుకు నడిపిస్తే మాకు ఓకే. ఆమె ఎంతో అనుభవమున్న రాజకీయ నేత. పెద్ద రాష్ట్రాలలో ఒకటైన బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె ఏంటో మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని అభిప్రాయపడ్డారు.  

మహిళలపై లాలూ అభ్యంతరకర వ్యాఖ్యలు!

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేపట్టిన ‘మహిళా సంవాద్’ యాత్రపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు మహిళలను చూసేందుకు ఈ ర్యాలీకి వెళ్తున్నారని లాలూ పేర్కొన్నారు. లాలూ వ్యాఖ్యలను అధికార జనతాదళ్  (యునైటెడ్) నేతలు ఖండిస్తున్నారు. లాలూ తన మానసిక స్థితిని గురించి ఆసుపత్రిలో చూపించుకుంటే మంచిదని అంటున్నారు. 

లాలూతో పాటు వైసీపీ ఓటు కూడా.. 

ఇండియా కూటమిలో అధిపతి వివాదం రోజురోజుకూ ఎక్కువవుతోంది. అంతే కాకుండా మమతా బె నర్జీకి మద్దతిస్తున్న వారి సంఖ్య కూ డా క్రమంగా పెరుగుతున్నట్లు స్ప ష్టంగా అర్థమవుతోంది. ఈ జాబితా లో తాజాగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసా ద్ యాదవ్ కూడా చేరిపోయారు. వారం రోజుల కింద మమత మాట్లాడుతూ.. ఇండియా కూటమికి నేతృ త్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పడంతో ఈ ఆంశం తెరమీదకు వచ్చింది.

ఇక అప్పటి నుంచి ఇండియా కూటమిలోని అనేక పార్టీ లు నాయకత్వ మార్పు గురించి వ్యా ఖ్యానిస్తున్నాయి. వైసీపీ, ఎన్సీపీ (పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కూడా ఈ విషయం మీద తమ వైఖరి గురిం చి మాట్లాడుతున్నారు. మొదట్లో కాం గ్రెస్‌కు మద్దతుగా మాట్లాడిన లాలూకూడా ప్రస్తుతం మమతా బెనర్జీ వైపే మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ అ భ్యంతరంతో పనే లేదని లాలూ పే ర్కొనడం గమనార్హం.