26 May, 2026 | 9:55 AM

విత్తనాలు, ఎరువుల కొరత రావొద్దు

17-06-2024 12:05 AM

కరీంనగర్, జూన్ 16 (విజయక్రాంతి): విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. విద్యుత్తు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడా లన్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొంత సుధాకర్, నాయకులు గుండారపు శ్రీనివాస్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి చెంతకు మందిర వివాదం

చొప్పదండి: గోపాల్‌రావుపేట హనుమాన్ ఆలయ వివాదం మంత్రి చెంతకు చేరింది. ఆలయం శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మించేందుకు నేచర్ యూత్‌క్లబ్ ముందుకొచ్చింది. దీనిపై జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.  ఆదివారం ఎల్కతుర్తికి వచ్చిన మంత్రి పొన్నం దృష్టికి కుల సంఘాల నాయకులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గుడి నిర్మాణం జరిగేలా చూడాలని వినతిపత్రాన్ని అందజేశారు.