లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి రైల్వే
17-06-2024 12:05 AM
ఒకేసారి అత్యధిక మంది ప్రజా సేవలో పాల్గొని రికార్డు
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): వివిధ ప్రదేశాల్లో ఒకేసారి అత్యధిక మంది ప్రజా సేవలో పాల్గొనడం ద్వారా ఇండియన్ రైల్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. రైల్వే మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 26న చేపట్టిన ఓ కార్యక్రమానికి 2,140 ప్రాంతాల్లో మొత్తం 40,19,516 మంది హాజరయ్యారు. రోడ్ ఓవర్, రోడ్ అండర్ రైల్వే వంతెనల ప్రారంభోత్సవం, రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమం ఒకే రోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒకేసారి ఎక్కువ మంది పాల్గొన్న అంశంలో భారతీయ రైల్వే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.






