16 June, 2026 | 2:00 AM

మహిళా సంఘాలలో రూ.50 లక్షల అవినీతి?

16-06-2026 01:16 AM

సిద్దిపేట జిల్లా దానంపల్లి మహిళల ఆరోపణ

బ్యాంకు ముందు నిరసన, విచారణకు డిమాండ్

చేర్యాల, జూన్ 15: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని దానంపల్లి గ్రామంలో గ్రామ మహిళ సంఘాలలో అవినీతి జరిగినట్లు మహిళా గ్రూప్ సభ్యులు ఆరోపించా రు. నిరక్షరాస్యతను, అమాయకత్వంను అసరాగా చేసుకుని మహిళ సంఘాలపై పని చేసే సీఏ నిధులు గోల్ మాల్ చేసిందని గ్రూప్ సభ్యులు తెలిపారు.

తమకు బ్యాంకు ఇచ్చిన రుణం ఎంత,  బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయి ఎంత ఉన్నాం, సీఏ ఎంత మే రకు చేతివాటం ప్రదర్శించిందో తమకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చేర్యాలలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు మహిళలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు వి లేకరులతో మాట్లాడుతూ శ్రీ నిధి మండల సమాఖ్య నుంచి తమకు మంజూరు చేసిన రుణానికి, తమ మహిళ గ్రూపు అకౌంట్లో ఉన్న మొత్తానికి తేడా ఉందని, తాము రుణం తీసుకున్న మొత్తానికి అదనంగా ఉందని వాపోయారు.

గ్రామంలో ఉన్న 24 గ్రూపు ల్లో దాదాపుగా రూ.50లక్షల మేరకు అవకతవకలు జరిగినట్లు తెలిపారు. జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, బ్యాంకు అధికారులు, మహిళ సంఘాల సీసీలు, సీఏలతో ప్రత్యేక కమిటీ వేసి నిజాలను తెల్చాలని డిమాండ్ చేశారు. అనంతరం బ్యాంకు మేనేజర్ శ్రీలతను కలిసి తమ గ్రూపుకు వచ్చిన రుణం, చెల్లించిన మొత్తంతో పాటు వారు తీసుకున్న రుణం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ శ్రీలత విలేకరుల తో మాట్లాడుతూ బ్యాంకు నుంచి రుణాల మంజూరు పారదర్శకంగా ఏ గ్రూప్ కు సంబందించిన ఋణంను ఆ మహిళా సం ఘం ఖాతాలో జమ చేశామని అనంతరం అంతర్గతంగా సభ్యులు తీసుకున్న రుణం తదితర వాటిని సంబంధిత వెలుగు అధికారులు విచారణ జరిపితే నిజాలు వెల్లడవుతాయన్నారు.