05-12-2024 01:29:19 AM
రూ.5.97 లక్షల నగదుతో ఉడాయించిన యువకులు
ఆదిలాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): సరుకులు కొనుగోలు చేసేందుకు కస్టమర్లుగా వచ్చిన ఇద్దరు యువకులు ఓ మార్ట్‌లో కన్నం వేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. బేల మండల కేంద్రంలోని శ్రీకర్ మార్ట్‌లో క్యాష్ కౌంటర్ వద్ద రూ.5.97 లక్షల నగదు ఉన్నది. కస్టమర్లుగా వచ్చిన ఇద్దరు యువకులు ఆ నగదును ఎత్తుకెళ్లారు.
కొద్దిసేపటికి గమనించిన మార్ట్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమాని ఫిర్యాదుతో సంఘటన స్థలాన్ని ఎస్సై దివ్య భారతి సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అలాగే సీఐ సాయినాథ్ మార్ట్‌కు సిబ్బందితో కలిసి వచ్చి, మార్‌టలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్టు వారు తెలిపారు.