calender_icon.png 26 August, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన భోజనం అందించాలి

05-12-2024 01:26:27 AM

మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్

మహబూబాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తనకు సమాచారం ఇవ్వాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ అన్నారు. బుధవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల కు ఎలాంటి సమస్యలు ఉన్నా ఉపాధ్యాయు లు తన వద్దకు తీసుకురావాలని తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సతీశ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ ఉన్నారు.