సెల్ఫీ పాయింట్ పెట్టారు..
ఫోటో దిగకుండా అడ్డుకున్నారు
వరంగల్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై ఓటర్లకు అవగాహన క ల్పించడానికి జిల్లాలోని పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆకుపచ్చని సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించకపోవడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సెల్ఫీ పాయింట్ల వద్ద ఫోన్ దిగే అవకాశం లేకపోయిందని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించకూడదని అధికారులు ముందుగా ఆదేశిం చినప్పటికీ, ప్రత్యేక సెల్ఫీ పాయింట్లు పోలిం గ్ కేంద్రం వెలుపల ఏర్పాటు చేయకపోవడం పట్ల అధికారుల తీరుపై ఓటర్లు మం డిపడ్డారు. డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు వాటిని ఏర్పాటు చేశారని పలుచోట్ల ఎన్నికల బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు.






