15 April, 2026 | 9:08 AM

అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలి

15-12-2025 12:37 AM
  1. మంత్రి అజారుద్దీన్ 
  2. లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 72వ వార్షికోత్సవం

హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో నైపుణ్యత సాధించినప్పుడే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉం టుందని మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. ఆబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో శని వారం 72వ వార్షికోత్సవ వేడుకలు (రంగోస్థావ్ 2025-2026), ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి అజారుద్దీన్‌తోపాటు డాక్టర్ భూమిరెడ్డి చం ద్రశేఖర్‌రెడ్డి, డీన్ అంజలి జనార్దన్, ఇఫ్తే కార్ షరీఫ్, శైలేందర్ సింగ్, జయ సంహిత, చల్ల సునీత, భరత్ భూషణ్, పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనీ ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మంత్రి అజరుద్దీన్ మాట్లాడుతూ.. లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు దేశ విదేశాల్లో ఉన్నత హోదాలో కొనసాగుతున్నారని, విద్యార్థులకు నైపుణ్యత కలిగిన విద్యను అందించడంలో ఇక్కడి ఉపాధ్యాయుల ప్ర త్యేకత ఉందని ఆయన కొనియాడారు. అనంతరం మంత్రి అజారుద్దీన్‌ను ప్రిన్సిపల్ బ్రదర్ ఆంటోనీ, కరస్పాండెంట్ బ్రదర్ జెకబ్, వైస్ ప్రిన్సిపల్ అపోలో అపోలీ ఘనంగా సత్కరించారు.

అనంతరం పాఠశాల విద్యార్థులు ఆర్కెస్ట్రా, కవ్వాలి, నాటక ప్రదర్శన, వివిధ పాటల పైన విద్యార్థుల నృత్యాలు, వారి తల్లిదండ్రులను, తన్మయంలో ముంచెత్తారు. కార్యక్ర మంలో పాఠశాల ఉపాధ్యాయులు అజిత్ కుమార్, సంపత్ కుమార్, బ్రిడ్జ్ మోహన్, రమేష్, శ్రీధర్, బాల్ రెడ్డి, దీప్తి జైస్వాల్, సునీత మరియా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.