12 June, 2026 | 2:22 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరీష్

15-12-2025 12:39 AM

హనుమకొండ, డిసెంబర్ 14(విజయ క్రాంతి):రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి ప్రారంభమైంది.హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో, ఐనవోలు మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుండగా హనుమకొండ జి ల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు.

వార్డులు, సర్పంచులకు వచ్చిన ఓట్లను ఎన్నికల అధికారులు కౌం టింగ్ చేస్తుండగా జిల్లా కలెక్టర్ పరిశీలించా రు. కౌంటింగ్ కేంద్రాలలో ఎన్నికల అధికారులు, అభ్యర్థుల తరఫున హాజరైన ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుండగా కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ధర్మసాగర్ లో డి ఆర్ డి ఓ మేన శ్రీను, ఎంపీడీవో అనిల్ కుమార్, తహసిల్దార్ సదానందం, ఇతర అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించగా, ఐనవోలులో ట్రైనీ డిప్యూటీ కలె క్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, తహసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో నర్మద, ఇతర అధికారులు ఉన్నారు.