30 June, 2026 | 9:00 PM

Breaking News

పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •  

పాక్ ఇక భిక్షాటన చేయదని వారికి తెలుసు

02-06-2025 02:38 AM

ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఇస్లామాబాద్, జూన్ 1: పాకిస్థాన్ ఇకపై భిక్షాపాత్ర పట్టుకుని మిత్రదేశాలకు వెళ్లదని మిత్రదేశాలకు తెలుసని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ మిత్రదే శాలతో సంబంధాలు మెరుగుపరుచుకుందని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణల్లో పాక్‌ను చాలా దేశాలు భాగస్వామిగా చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

దేశంలో సహజవనరులకు కొదువ లేదని వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆర్థిక సవా ళ్లను అధిగమించవచ్చని తెలిపారు.  బలూచిస్థాన్‌లోని క్వెట్టా కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.