calender_icon.png 5 July, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా నేటి ప్రజావాణి వాయిదా

02-06-2025 02:36:57 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జీహెచ్‌ఎంసీ హెడ్‌ఆఫీస్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జూన్ 2న నిర్వహించే ప్రజావాణి వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి యథావిధిగా జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గ్రేటర్ ప్రజలందరూ గమనించి సహకరించాలని కమిషనర్ కోరారు.