calender_icon.png 11 January, 2026 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి బయటపడుతుందనే పారిపోయారు

07-01-2026 01:15:48 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో తమ తప్పులు బయటపడతాయనే భయంతోనే బీఆర్‌ఎస్ నేతలు సభకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. భయంతో దాక్కున్న వారికి సభా హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందని సాక్షాత్తూ కేసీఆర్ కుమార్తె కవితే ఆరోపిస్తున్నారు.

దీనికి బీఆర్‌ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు.స్పీకర్‌పై నిందారోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే కృష్ణా జలాల దోపిడీ ఆగిందన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సంఘాలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వారి ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు.