07-01-2026 01:16:16 AM
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ వార్డుల విస్తరణ అంశం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అభ్యంతరాలపై, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆధ్వర్యం లో చేపట్టనున్న కార్యా చరణపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతమ్ రావు, పార్టీ సీనియర్ నాయకులు ఎన్‌విఎస్ ఎస్ ప్రభాకర్ సహా పార్టీకి చెందిన ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.