calender_icon.png 10 May, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూగుల్‌లో వెతికి మరీ కడతేర్చారు

23-04-2025 01:33:26 AM

బెంగళూరు, ఏప్రిల్ 22: కర్ణాటకలో సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో రోజుకో కొత్త విష యం వెలుగు చూస్తోంది. తాజాగా గూగుల్‌లో వెతికి మరీ ఓం ప్రకాశ్‌ను భార్య పల్లవి హతమార్చినట్టు పోలీసులు తమ దర్యాప్తులో పేర్కొన్నారు.

దీంతో కోర్టు పల్లవిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. హత్య చేయడానికి ముందు ఎలా చంపాలి అన్న దానిపై పల్లవి ఐదు రోజులు గూగుల్‌లో పరిశోధన చేసినట్టు తెలిపా రు. ఓం ప్రకాశ్‌ను భార్య పల్లవి, కుమార్తె కృతి పక్కా పథకం ప్రకారమే కడతేర్చినట్టు పేర్కొన్నారు.  ఓం ప్రకాశ్ హత్యకు పల్లవి మానసిక స్థితి ఎంత కారణమో.. ఆస్తి గొడవలు అంతే కారణమని పోలీసులు భావిస్తున్నారు.