21 June, 2026 | 1:38 AM

టీజీ20 లీగ్‌పై సీఐడీకి టీసీఏ ఫిర్యాదు

21-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 20 : హెచ్‌సీఏ నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఆర్థిక, పరిపాలనా వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ సీఐడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐడీ డీజీపీ చారు సి న్హాకు ఫిర్యాదు సమర్పించింది. టీజీ20కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆస్తులను తక్షణమే ఫ్రీజ్ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడం, అలాగే లీగ్ నిర్వహణను నిలిపివేయాలని టీసీఏ కోరిం ది.

హెచ్‌సీఏ ఆర్థిక వ్యవహారాలపై తెలంగాణ లోకాయుక్త ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రూ. 46.15 కోట్లకు పైగా నిధులు సమీకరించబడినట్లు సమాచారం వస్తున్నప్పటికీ ప్రాథమి క ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవనీ టీసీఏ సెక్రటరీ గురువారెడ్డ్ చెప్పారు. అసలు లీగ్‌కు హెచ్సీఏ సర్వసభ్య సమావేశం ఆమోదం ఎక్కడుందని ప్రశ్నించారు, బీసీసీఐ అనుమతి ఉంటే దానిని బహిర్గతం చేసేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని నిలదీశారు.

ఫ్రాంచైజీల వెనుక అసలు లబ్ధిదారులు ఎవ రు? అన్ని నిబంధనలు పాటించామని చెబుతున్నవారు, ఆమోదా లు, ఒప్పందాలు, యాజమాన్య వివరాలు, ఆర్థిక లావాదేవీలను బహిరంగంగా ఎందుకు వెల్లడించడం లేదనీ గురువారెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. క్రికెట్ పరిపాలన కొద్దిమంది ప్రభావశీలుల వ్యక్తిగత ఆస్తి కానీ, ఇది ఆటగాళ్లది,  కోట్లాది క్రికెట్ అభిమానులదనీ గుర్తు చేశారు. లీగ్‌కు సంబం ధించి అన్ని అనుమతులనూ, యాజమాన్య వివరాలు, ఆర్థిక పత్రాలు ప్రజల ముందుకు తీసుకురావాలని టీసీఏ డిమాండ్ చేసింది.