05-07-2025 12:58:15 AM
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా ‘జన నాయగన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు ముఖ్య పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో నటి ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. ఇటీవలే ఈ చిత్రంలో భాగం కావటంపై ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. “జన నాయగన్’లో విజయ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ.
ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నటిగా నాలోని కొత్త యాంగిల్‌ను చూపించే చిత్రమిది” అంటూ ప్రియమణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సంక్రాంతి బరిలో నిలువనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.