05-07-2025 12:56:34 AM
కిరీటిరెడ్డి హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘జూనియర్’. రాధాకృష్ణ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జూలై 18న విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్లలో జోరు పెంచారు. ఒక పాట బిగ్ హిట్ అయి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించినప్పుడు అది వైరల్ సాంగ్ అనే లేబుల్‌ను సంపాదిస్తుంది.
కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఇక్కడ వైరల్ అవుతోంది పాట మాత్రమే కాదు హీరోయిన్ శ్రీలీల కూడా. సెకండ్ సాంగ్ ‘వైరల్ వయ్యారి’కి కొత్త ఇమేజ్ ఇచ్చింది శ్రీలీల. ‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబునీ..’ అంటూ సాగుతోందీ పాట. ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ పాటను హరిప్రియతో కలిసి పాడారు.
కళ్యాణ్ చక్రవర్తి ఈ గీత సాహిత్యానికి మోడర్న్ టచ్ ఇచ్చారు. దీంతో యూత్‌తో కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా లాంగ్వేజ్, ట్రెండీ ఫ్రేసెస్‌తో ఆకట్టుకుంటోందీ పాట. ఈ సినిమాకు డైలాగ్స్: కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని; డీవోపీ: కేకే సెంథిల్ కుమార్; ఎడిటర్: నిరంజన్ దేవరమనే.