31 July, 2026 | 1:15 PM

కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ

26-05-2024 02:00 AM

సినీ ఫక్కీలో జరిగిన చోరీ

సోషల్ మీడియాలో వీడియో వైరల్

మధ్యప్రదేశ్, మే 25 : మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఆగ్రా ముంబై జాతీయ రహదారిపై షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు దొంగలు కదులుతున్న ట్రక్కు నుంచి వస్తువులను చోరీ చేశారు. ట్రక్కు వెనుక కారు నడుపుతున్న ప్రయాణికులు ఈ ఘటన మొత్తాన్ని రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను పరిశీలిస్తే.. ఇద్ద రు వ్యక్తులు కదులుతున్న ట్రక్కుపైకి ఎక్కారు. అనంతరం ట్రక్కులో ఉన్న వస్తువులను రోడ్డుపై విసిరేశారు. మూడో వ్యక్తి బైక్ నడుపుతూ ఫాలో అవుతున్నాడు. దొంగతనం అనంతరం ఆ ఇద్దరు దొంగలు వేగంగా వస్తున్న ట్రక్కు పై నుంచి బైక్‌పైకి దూకి వెళ్లిపోయారు. షాజాపూర్ హైవేపై ఇలాంటి దొంగతనాలు జరగడం కొత్తేమీ కాదని స్థానికులు చెబుతున్నారు. ట్రక్కు డ్రైవర్లు కూడా దొంగ తనంపై చాలా ఫిర్యాదుల చేసినా ఇక్కడి పోలీసులు పట్టించుకోరని చెబుతున్నారు.