కేరళను ముంచెత్తిన వర్షాలు
11 మంది మృతి
న్యూఢిల్లీ, మే 25: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన నగరాలు జలమయమ య్యాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షా లు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఏడు జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీచేసి ంది. జిల్లాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర మంత్రి కే రాజన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి ప్రవాహాలు తీర ప్రాంతాలకు దూరం గా ఉండాలని హెచ్చరించారు. ము ఖ్యంగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సహాయక చర్యలు చేపట్టేందుకు 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.






