7 July, 2026 | 3:59 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

బెల్లంపల్లిలో రెచ్చిపోయిన దొంగలు

24-06-2025 12:29 AM
  1. ఎస్బీఐ ఏటీఎం చోరీకి యత్నం

పెట్రోలింగ్ పోలీసులను చూసి పరారు

బెల్లంపల్లి అర్బన్, జూన్ 23: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సం ఘటన జిల్లాలో కలకలం రేపింది. బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం. కాల్ టెక్స్ ఫ్లైఓవర్ సమీపంలోని బజాజ్ షోరూం పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు చోరికి యత్నం చేశారు.

దుండగులు పథకం ప్రకారం గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్స్ తో ఏటీఎం బాక్సును కొంతమేర కట్ చేశారు. ఇదే క్రమంలో పెట్రోలింగ్ పోలీసుల వాహనాన్ని చూసి దొంగలు అక్కడి నుంచి పారిపోయారని, ఈ దొంగతనానికి యత్నించింది హర్యానాకు చెం దిన ముఠా అని పో లీసులు భావిస్తున్నారు.

దొంగ తనానికి ప్రయత్నించిన  దొంగల కోసం పోలీసులు ఫోకస్ పెట్టారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్య, టూ టౌన్ ఎస్‌ఐ మహేందర్ సందర్శించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.