24 August, 2026 | 10:39 PM

Breaking News

నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •  

స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

24-06-2025 12:30 AM

మేడ్చల్, జూన్ 23(విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్ కాకతీయ నగర్ నార్త్ లో గల స్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలని కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. నీటి కొర త ఉన్నందున బోరు వేయించాలని, స్నానా ల గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని, వృద్ధులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే కాలనీలో డ్రైనేజీ పొంగుతోందని, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకీకరించాలని వారు కోరారు. ఎమ్మె ల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు పరిస్థితిని తెలియజేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కాకతీయ నగర్ వాసులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, కొమురయ్య, వెంకటాచారి, సత్యనారాయణ, అజయ్ తదితరులున్నారు.