పెద్దపల్లిలో దొంగలు బీభత్సం
రెండు అపార్ట్ మెంట్ లో చోరీ..
దొంగల కోసం అన్వేషిస్తున్న పోలీసులు..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapally District) కేంద్రంలోని భూమ్ నగర్ కాలనీలో రెండు అపార్ట్మెంట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు రెండు ఇళ్ళను గుల్ల చేశారు. పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యాజమాన్యాలైన సందీప్, సదయ్యలు ఒకరు విదేశాలకు వెళ్లగా, మరొకరు తీర్థయాత్రలో ఉండడంతో రెండు ఇళ్లకు తాళాలు ఉన్నట్లుగా పసిగట్టిన దొంగలు సోమవారం అర్ధరాత్రి అపార్ట్మెంట్లలోకి ప్రవేశించి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సీఐ ఘటన స్థలానికి చేరుకుని, క్లూస్ టీం బృందంతో అన్వేషిస్తున్నారు. జిల్లాలో దొంగలు పెట్రేగుతుండడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు.






