రంగారెడ్డి రైజర్స్‌కు మూడో విజయం
29-06-2026 12:58 AM
హైదరాబాద్, జూన్ 28: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనిధి యూనివర్సిటీ టీజీ20 లీగ్‌లో రం గారెడ్డి రైజర్స్ అదరగొడుతోంది. పాలమూరు స్ట్రుకర్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాలమూరు 130 పరుగులకే కుప్పకూలింది. కరియప్ప 31 పరుగులకే 4 వికెట్లు పడదొట్టాడు. ఛేజింగ్‌లో రం గారెడ్డి రైజర్స్ దూకుడుగా ఆడింది. అవనీష్‌రావు హాఫ్ సెంచరీతో చెలరేగిపోగా, జ్ఞానప్రకాష్ రెడ్డి 47 పరుగులు చేశాడు. దీంతో రంగారెడ్డి రైజర్స్ 14 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.






