1 July, 2026 | 10:59 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పేజ్ ఇండస్ట్రీస్ లాభంలో 38% వృద్ధి

24-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 23: జాకీ బ్రాండ్ ఇన్నర్‌వేర్ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ నికరలాభం మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 38 శాతం వృద్ధిచెంది రూ. 108 కోట్లకు పెరిగింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 78 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 3.2 శాతం పెరిగి రూ. 995 కోట్లకు చేరింది. ఇబిటా 24 శాతం పెరుగుదలతో రూ. 167 కోట్ల వద్ద నిలిచింది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.120 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేసింది. డివి డెండు చెల్లింపునకు మే 31 రికార్డుతేదీగా నిర్ణయించగా, జూన్ 22లోపున చెల్లించనున్నట్టు కంపెనీ తెలిపింది.