2 July, 2026 | 12:08 AM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రూ.2 వేల కోట్లతో ఏఐ ఫౌండేషన్ మోడల్

24-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 23: భారతీయ కంపెనీలు, వాణిజ్యవేత్తలు, విద్యావేత్తలు, పరిశోధకులు వారి అవసరాలకు తగినరీతిలో కస్టమైజ్ చేసుకుని ఉపయోగించుకునే రీతిలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఫౌండేషనల్ మోడల్‌ను రూపొందించాలని కేంద్ర ప్రభు త్వం సిద్ధమయ్యింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రూ.2,000 కోట్ల తొలి పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనితో ఇప్పటికే ఫౌండేషనల్ మోడల్స్‌ను రూపొందిస్తున్న యూఎస్, చైనా తదితర దేశాల సరసన భారత్ చేరుతుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో అమలవుతున్న రూ. 10,000 కోట్ల ఇండియా ఏఐ మిషన్‌లో భాగంగా ఏర్పాటుచేసే ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ కింద ఈ ఫౌండేషన్ మోడల్ నెలకొల్పుతారు. ప్రైవేటు రంగంలో ఏఐపై పనిచేస్తున్న ఉన్నత విద్యా సంస్థలు, ప్రముఖ పరిశోధకుల సేవల్ని ఈ ఫౌండేషన్ మోడల్ రూపకల్పనకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు చెప్పా రు. ఈ మోడల్‌ను పలు అప్లికేషన్లు, సర్వీసుల్లో వాడుకోవచ్చన్నారు. 


ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రెడీ

ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రారంభం


దేశీయ భాషల్లో ఏఐ

ఫౌండేషన్ మోడల్స్ అనేవి ప్రిహె జనరేటివ్ ట్రాన్స్‌ఫార్మర్స్. ఇతర ఏఐ మోడల్స్‌ను అభివృద్ధిపర్చడానికి పునాది వంటివి. కొత్త రెస్పాన్స్‌లను జనరేట్ చేయడానికి పాత, ఇప్పటికే ఉన్న డేటా నుంచి అవి (ఫౌండేషన్ మోడల్స్) నేర్చుకుని, శిక్షణ పొందు తాయి. ‘ఇతర అంతర్జాతీయ కంపెనీలతో పోలిస్తే భారత్‌లో కంపెనీల అవసరాలు వేరుగా ఉండొచ్చు. ఇప్పటివరకూ ‘భాషిణి’ వంటి ప్రాజెక్టుల్లో జరిగిన పురోగతిని తీసుకుని, మన సొంత భాషలకు అనుగుణంగా ఏఐ పనిచేసేలా చూడటం ఈ ఫౌండేషన్ మోడల్ లక్ష్యం’ అని ఆ అధికారి వివరించారు. భాషి ణి ఏఐ ఆధారిత భాషల తర్జూమా ప్లాట్‌ఫా మ్ మోడల్. ఐటీ మంత్రిత్వ శాఖ అభివృద్ధిచేసిన దీనిని 2022లో ప్రారంభించారు.

330 మోడల్స్

ప్రపంచవ్యాప్తంగా ఫౌండేషన్ మోడల్స్‌ను ప్రైవేటు కంపెనీలు, ఆయా ప్రభుత్వాలు రెండూ నిర్మిస్తున్నాయి. స్టాన్‌ఫోర్డ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఫౌండేషన్ మోడల్స్ డేటా ప్రకారం 2024 ఏప్రిల్ నాటికి ప్రపంచంలో 330కిపైగా ఫౌండేషన్ మోడల్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా మైక్రోసాఫ్ట్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ, గూగుల్, అమెజాన్‌లు ఫౌండేషన్ మోడల్స్‌లో అత్యాధునిక రూపాలను అభివృద్ధి పరుస్తున్నాయి.