9 July, 2026 | 4:25 PM

ఈ నేరస్తురాలి విడుదల ఏప్రిల్‌లో!

16-12-2024 12:55 AM

సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటి’. ఇది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత అనుష్క  నటిస్తున్న చిత్రం కావటంతో అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ర్పడ్డాయి. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఆదివారం ప్రకటించారు.

2025, ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వీడి యో, పోస్టర్ ఆకట్టుకుంటున్నా యి. విడుదల తేదీ పోస్టర్‌లో అను ష్క చీర కట్టుకుని టెర్రిఫిక్ లుక్‌లో కనిపించింది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ సహా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: మనోజ్ రెడ్డి కాటసాని; ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి; సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్; మాటలు: సాయి మాధవ్ బుర్రా; కథ: చంటకింది శ్రీనివాసరావు; ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి;  యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ క్రిషన్.