అంతకుముందే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం
నటి తాప్సీ పన్ను.. డెన్మార్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తన పెళ్లి డేట్ విషయమై తాప్సీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఆంగ్ల వెబ్ సైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీ ఈ విషయాన్ని తెలిపింది. ‘మా పెళ్లి నిరుడు డిసెంబర్‌లోనే జరిగింది. పెద్దల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం.
త్వరలోనే మా వివాహ వార్షి కోత్సవం రానుంది. డిసెంబర్‌లో పెళ్లి తర్వాత ఆత్మీయులు, సన్నిహితుల కోసం ఉదయ్‌పూర్‌లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. ఆత్మీయులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించాం. అంతేకానీ దాని గురించి బహిరంగ ప్రకటన చేయలేదు. వ్యక్తిగత, వృత్తిపర మైన జీవితాలకు సంబంధించి సరైన బ్యాలెన్స్ ఉండాలని మేం అనుకు న్నాం. అందువల్లనే మా పెళ్లిని అందరూ సీక్రెట్ మ్యారేజ్ అనుకున్నారు’ అని తాప్సీ చెప్పింది.






