ప్రపంచం కోరుకున్న సౌందర్యం ఈ మందారం!
శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా ‘భోగి’. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఇటీవల కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర నిర్మాతలు ఇప్పుడు అందాల తార డింపుల్ హయాతి పాత్రను రివీల్ చేశారు. ఆమె ఇందులో ‘మందారం’ అనే పాత్రలో కనిపించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో, 1960 కాలం నాటి శ్రీమంతురాలిలా ఆకట్టుకుంటోంది. ఆమె చూపుల్లోనే ఒక తిరుగుబాటు స్వభావం కనిపిస్తోంది.
ఈ లుక్‌ను సోషల్‌మీడియాలో విడుదల చేసిన మేకర్స్ ‘ప్రపంచం కోరుకున్న సౌందర్యం.. ప్రపంచం ఎన్నడూ అర్థం చేసుకోని ఆత్మ, మందారంను పరిచయం చేస్తున్నాం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రపంచం గురించి ఏమాత్రం పట్టించుకోని ధైర్యవంతురాలి పాత్రలో డింపుల్ కనిపించనుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా వచ్చే ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: ఏ కిషోర్‌కుమార్; సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఆర్ట్: కిరణ్‌కుమార్ మన్నే.






