12 May, 2026 | 2:26 AM

పెద్ది ట్రైలర్ డేట్ చెప్పేశాడు!

12-05-2026 12:47 AM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్- స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో జూన్ 4న పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుందీ సినిమా. ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న జరగనున్నాయి. తాజాగా చిత్ర నిర్మాతలు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఇప్పటివరకు రామ్‌చరణ్ పాత్రలోని రెండు షేడ్స్ చూపించిన టీమ్.. ట్రైలర్‌లో సినిమా అసలు కథ, ప్రధాన పాత్ర లను రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్‌చరణ్ పూర్తి స్థాయి 1960ల గ్రామీణ యువకుడి లుక్‌లో రైల్వేట్రాక్‌పై నడుస్తూ కనిపిస్తున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ ముఖ్యపాత్రల్లో కనపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు; ఎడిటర్: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా.