వేసవిలో కూల్ వైబ్ ఇచ్చే చిత్రమిది
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘గోదారి గట్టుపైన’. రొమాన్స్, కామెడీ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన ఆహ్లాదకరమైన రూరల్ డ్రామా ఇది. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా మే 8న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. “నేను పుట్టి పెరిగింది తెలంగాణ. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గోదారి యాస నేర్చుకున్నా. ప్రతి డైలాగ్‌ను సహజంగా చెప్పడానికి ప్రయత్నించా. ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. నిధి కూడా చాలా చక్కగా తెలుగు నేర్చుకుని మాట్లాడింది. కృష్ణపట్నం ఫుడ్ ఎంత రుచిగా ఉంటుందో, మా సినిమా కూడా అంత క్యూట్‌గా ఉంటుంది. సినిమాలో ఉన్నదే మన జీవితంలో ఉంటుంది. ఇది పూర్తిగా రిలేట్ అయ్యే సినిమా. మే 8న మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి. గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.. కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా ప్రేక్షకులు సినిమాను ప్రేమిస్తారు. ఈ సమ్మర్‌లో సినిమా అందరికీ కూల్ వైబ్ ఇస్తుంది” అన్నారు. కథానాయకి నిధి ప్రదీప్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. ‘మాయ’ పాత్ర అందరికీ నచ్చుతుంది. ఇది ఒక నీట్ అండ్ క్లీన్ ఫిల్మ్. ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల మూడ్‌ను కూల్ చేస్తుంది” అని తెలిపారు. డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. “మా ‘గోదారి గట్టుపైన’ ఈ వేసవిలో ఒక చలివేంద్రంలాంటిది. మా నటీనటులు ప్రేక్షకుల్ని నవ్విస్తారు, కవ్విస్తారు, మురిపిస్తారు, ఏడిపిస్తారు కూడా ఇది నా గ్యారెంటీ” అని తెలిపారు. ‘అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా’ని నిర్మాత అభినవ్ రావు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు రేణు, రాజీవ్ కనకాల, దేవిప్రసాద్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సుదర్శన్, సంగీత దర్శకుడు నాగవంశీకృష్ణ, కూడా మాట్లాడారు. చిత్రబృందం పాల్గొన్నారు.






