29 April, 2026 | 1:57 AM

రావు బహదూర్ రాక ఖరారు

29-04-2026 12:16 AM

సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్ నేతృత్వంలోని జీఎంబీ ఎంటర్ టైన్‌మెంట్ సమర్పిస్తోం ది. వెంకటేశ్ మహా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాయి.

వికాస్ ముప్పాల, దీపా థామ స్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 5న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి కార్తిక్ పరమార్ డీవోపీగా, స్మరణ్ సాయి సంగీత దర్శకుడిగా, రోహన్ సింగ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.