16 April, 2026 | 3:50 AM

కొత్తతరహా యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇది

16-04-2026 02:10 AM

ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’. ‘ఎఫ్‌ఐఆర్’ సినిమాతో ఆకట్టుకున్న మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. మంజు వారియర్, అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 17న తెలుగు, తమిళ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో కథానాయకుడు ఆర్య మాట్లాడుతూ.. “మిస్టర్ ఎక్స్’ ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ సినిమా. డైరెక్టర్ మను ఆనంద్ ఇందులో యాక్షన్, ఎమోషన్స్, క్యారెక్టర్స్ అన్నీ కలిసి గొప్ప అనుభూతి కలిగించేలా తీర్చిదిద్దారు” అన్నారు. మరో హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో చాలా డిఫరెంట్ పాత్ర పోషించా. ఇది కొత్త తరహా యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ. చాలా భిన్నంగా ప్రయత్నించాం. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా” అని చెప్పారు.