16 April, 2026 | 3:52 AM

బెంచ్ మార్క్ సెట్ చేసే చిన్న సినిమా మాది

16-04-2026 02:12 AM

సుమైర స్టూడియోస్, కేఏ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. హీరో కిరణ్ అబ్బవరం నిర్మాత. సాయితేజ్, వేద జలంధర్ హీరోహీరోయిన్లుగా, వీ మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “చిన్న చిత్రాల్లో తిమ్మరాజుపల్లి టీవీ సినిమా బెంచ్ మార్క్ సెట్ చేయబోతోంది. ఇండస్ట్రీలోని వారిని నా సినిమాలకు సపోర్ట్ చేయమని ఎప్పుడూ అడగలేదు. కానీ ఈ సినిమాకు సపోర్ట్ చేయమని కోరుతున్నా.

ఎందుకంటే కనీసం యాభై కుటుంబాల ఆశలు ఈ సినిమా మీద ఉన్నాయి” అన్నారు. ‘అందరూ ఈ నెల 17న థియేటర్స్‌కు వెళ్లి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా చూడండి’ అని చిత్ర కథానాయకుడు సాయితేజ్ కోరారు. ‘ఈతరం ప్రేక్షకులు తప్పకుండా మా మూవీ చూడాలి’ అని హీరోయిన్ వేద తెలిపారు. డైరెక్టర్ మునిరాజు మాట్లాడుతూ.. “నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకు, చెల్లికి ఏమీ కొనివ్వలేదు. ఈ నెల 17న తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అయ్యాక అంతా గర్వపడేలా చేస్తాను” అన్నారు. కేఏ ప్రొడక్షన్స్ సీయీవో రహస్య కిరణ్, చిత్రబృందం కూడా మాట్లాడారు.